Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మెగా చిరంజీవి బర్త్ డే ఈవెంట్ ‘మెగా కార్నివాల్’ కి నాగబాబు, పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి  67వ బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో బర్త్ డే ఈవెంట్ నిర్వహిస్తామని.. అభిమానులు ప్రతి ఒక్కరు రావాలని ఆయన కోరారు. మెగాస్టార్ చిరంజీవి  బర్త్ డే వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఇటు కుటుంబ సభ్యులు, అటు అభిమానులు భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి  పుట్టినరోజును రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగలా నిర్వహిస్తామని ఫ్యాన్స్ అంటున్నారు. అదేవిధంగా చిరంజీవి బర్త్ డే వేడుకలను ఈ నెల 21న హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ నిర్వహిస్తామని మెగా బ్రదర్ నాగబాబు  తెలిపారు. ఈ వేడుకలకు మెగా అభిమానులు ప్రతి ఒక్కరు రావాలని ఆయన సూచించారు. చిరంజీవి పుట్టినరోజు అంటే తమ ఇంట్లో అందరికీ వేడుకలాంటిదని.. అన్నయ్య బర్త్ డేను ఎప్పుడూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తామని నాగబాబు తెలిపారు. ఫ్యాన్స్ కోసం ఈ సారి ప్రత్యేకంగా కార్నివాల్‌లో నిర్వహిస్తామని చెప్పిన మెగా బ్రదర్.. అందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్  హాజరుకావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ ఎఫైర్స్ మీటింగ్ ఉండడంతో పవన్ రాలేకపోతున్నారని అన్నారు. చిరంజీవి బర్త్ డే వేదికపై సర్‌ప్రైజ్‌లు ఉంటాయన్నారు నాగబాబు. ప్రతిసారి శిల్ప కళావేదికలో నిర్వహించేవాళ్లమని.. ఈ ఏడాది సరికొత్త ప్లాన్ చేశామన్నారు. ఫ్యాన్స్ అందరూ ప్రత్యక్షంగా పాల్గొనేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్నివాల్‌ ఫెస్టివల్‌ని హైటెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని.. ఈ ఈవెంట్ మెగాస్టార్ అభిమానులకు ఒక జ్ఞాపకంగా ఉండిపోవాలని అన్నారు. ఈ వేడుకకు అన్ని ప్రాంతాల అభిమానులతో పాటు మీడియాకు కూడా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేదికపై ఎవరికీ తెలియని విషయాలను అన్నయ్య చిరంజీవి పంచుకుంటారని నాగబాబు తెలిపారు. ఎంట్రీ పాసులు రేపటి నుంచి బ్లడ్‌బ్యాంక్‌, జిల్లాల వారిగా అభిమాన సంఘాల అధ్యక్షుల వద్ద అందుబాటులో ఉంటాయన్నారు.

https://twitter.com/NagaBabuOffl/status/1560224526771752960?cxt=HHwWgMCogZr8g6crAAAA

Related Posts

Latest News Updates