తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నేడు తన 87 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి, ఆయనతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు కైకాలకు చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు కైకాల కొంత కాలం క్రితం నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఇంటిలోనే ఆయనకు చికిత్స జరుగుతోంది. “పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
https://twitter.com/KChiruTweets/status/1551518907944472576?s=20&t=ZMDGQ1hVVs8SLL5B6GN0dw