రాజ్యసభకు అర్హులైన వారిని ఎంపిక చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సినిమా పరిశ్రమకు అత్యంత అర్హులైన ప్రముఖులు కె.వి. విజయేంద్ర ప్రసాద్, ఇళయ రాజాను రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేసి, అరుదైన గౌరవాన్ని కట్టబెట్టారని చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యంత నిష్ణాతులైన కథా రచయితలలో ఒకరైన విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయినందుకు సభ గౌరవం పెరుగుతుందనడంలో సందేహం లేదని చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు.
రాష్ట్రపతి కోటాలో ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది నుంచి ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇందులో రాజమౌళి తండ్రి, కథా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ కూడా వున్నారు. ఈయనతో పాటు సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పీటీ ఉష, ధర్మస్తళ క్షేత్రం ధర్మాధికారి వీరేంద్ర హెగ్గేను రాజ్యసభకు నామినేట్ చేశారు. వీరందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.