Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సంక్రాంతికి లంగర్ వేయనున్న చిరంజీవి

వచ్చే సంక్రాంతికే మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా రాబోతోంది. ప్రస్తుతం కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. శ్రుతి హసన్ కథా నాయిక. వచ్చే యేడాది సంక్రాంతికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్రం యూనిట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో చిరు చేతిలో లంగర్ పట్టుకొని కనిపించాడు. అయితే.. చిరు ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కలుద్దాం.. సంక్రాంతికి.. జనవరి 2023 అని ఆ పోస్టర్ పై వుంది. త్వరలోనే టైటిల్ తో పాటు టీజర్ కూడా విడుదల కానుందట. ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి, ఎడిటర్.. నిరంజన్ దేవరమానే, సినిమాటోగ్రఫీ విల్సన్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్

Related Posts

Latest News Updates