సీతారామం, బింబిసార చిత్రాల యూనిట్ ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. కంటెంట్ బావుంటే.. ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనిచ్చాయని, మరింత ఉత్సాహాన్నిస్తూ.. కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని అన్నారు. దీనిని ఈ రెండు సినిమాలు చేసి చూపించాయని మెచ్చుకున్నారు. ఇదెంతో సంతోషకరమని తెలిపారు. సీతారామం, బింబిసార చిత్రాల యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక… సీతారామం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.25 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 5.60 కోట్ల గ్రాస్, 3.5 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది.
