టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఎమోషనల్ డ్రామా రంగమార్తాండ. ఇందులో బ్రహ్మానందం మాత్రం ఇందులో చాలా డిఫరెంట్ రోల్ లో కనిపించాడు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. బ్రహ్మానందం పోషించిన చక్రపాణి పాత్రపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక… మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కూడా బ్రహ్మానందంపై ప్రశంసలు కురిపించారు.
రంగమార్తాండ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో బ్రహ్మానందంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. చిరంజీవి, రాంచరణ్ శాలువాతో సత్కరించారు. చిరంజీవి, రాంచరణ్ తో పాటు ఆయన కుటుంబీకులు సురేఖ, శ్రీజ కూడా వున్నారు. బ్రహ్మానందంతో మరోవైపు చిరంజీవి సతీమణి సురేఖ, హైపర్ ఆది, వెన్నెల కిశోర్, శ్రీజ కలిసి దిగిన స్టిల్ కూడా ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.