జాతీయ చలన చిత్ర పురస్కారాలను దక్కించుకున్న నటీనటులకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ఉత్తమ నటుడి విభాగంలో అవార్డులు గెలుచుకున్న సూర్య, అజయ్ దేవగణ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న సూర్యకు నా అభినందనలు. నీ పుట్టిన రోజు సమయంలో ఇది రావడం మరింత ప్రత్యేకం. హ్యాపీ బర్త్ డే సూర్య. నీకు మరిన్ని ప్రశంసలు, అవార్డులు దక్కాలని కోరుకుంటున్నా. మిత్రుడు అజయ్ దేవగణ్ మూడోసారి జాతీయ అవార్డు తీసుకుంటున్నందుకు నాకు ఆనందంగా వుంది. శుభాకాంక్షలు. అల వైకుంఠపురంలో చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు దక్కించుకున్న తమన్, కలర్ ఫోటో, సూరరై పోట్రు చిత్ర యూనిట్లకు కూడా అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మరో వైపు చిరంజీవితో పాటు… ఇతర ప్రముఖులు కూడా వారికి అభినందనలు తెలిపారు.
