బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్షవ్ కఠినమైన వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం’ అనే యాటిట్యూడ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు విడిచిపెట్టాలని హెచ్చరించారు. సరిగ్గా పనిచేయాలని, పని చేయడం ఇష్టం లేనివారు ఉద్యోగం నుంచి వైదొలగడం మంచిదని అశ్వనీ వైష్ణవ్ అన్నారు. సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక పనులు చేస్తోందని, ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేయాలని ఉద్బోధించారు. ఇకపై… ప్రతి నెలా ఉద్యోగుల పనితనాన్ని సమీక్ష చేస్తామని మంత్రి ప్రకటించారు. సరిగ్గా పనిచేయని ఉద్యోగులకు ఎర్లీ రిటైర్మెంట్ ఇచ్చి, ఇంటికి పంపిస్తామని మంత్రి ప్రకటించారు. ఎంటీఎన్‌ఎల్‌కు ఎటువంటి ‘ఫ్యూచర్’ లేదని, మనందరికీ తెలుసు ఎంటీఎన్‌ఎల్ ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుందో. ఈ సంస్థకు సంబంధించి భిన్నమైన చర్యలు తీసుకుంటాం’అని అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు.
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కు కేంద్ర ప్రభుత్వం లక్షా 64 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్యాకేజీని బీఎస్ఎన్ఎల్ కు అందించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈవిషయాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీంతోపాటు బీఎస్ఎన్ఎల్ భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ విలీనానికి మంత్రి మండలి ఓకే చెప్పిందన్నారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి రూ.26 ,316 కోట్లతో 4జీ సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు.