డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ మూవీని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్‌బస్టర్ గా నిలిచాయి. గతంలో విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 1.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈరోజు కరీంనగర్‌లో జరిగిన గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్‌లో ‘దాస్ కా ధమ్కీ’ 2.0 ట్రైలర్ ను మంత్రి గంగుల కమలాకర్ లాంచ్ చేశారు.
అన్ని ఎలిమెంట్స్‌ని సమపాళ్లలో చూపించే పర్ఫెక్ట్ ట్రైలర్‌ను మేకర్స్ కట్ చేశారు. ట్రైలర్ కథాంశాన్ని తెలియజేస్తుంది. ఇది రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు భిన్నమైన వ్యక్తుల కథ. ఒకరు ధనవంతుడు, ఫార్మా కంపెనీకి సిఈవో. మరొకరు హోటల్ లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. ఫార్మా సిఈవో క్యాన్సర్ రోగులకు పూర్తిగా కోలుకోవడానికి సహాయపడే మందును కనుక్కుంటాడు.అతని లక్ష్యం క్యాన్సర్ రోగులు లేని ప్రపంచాన్ని చూడడమే. వెయిటర్ పేదవాడిగా చనిపోకూడదని అనుకుంటాడు. ఒక దురదృష్టకర సంఘటన ధనవంతుని మరణానికి దారి తీస్తుంది. అతని స్థానంలో వెయిటర్ ని తీసుకువస్తారు.
విశ్వక్ సేన్ ఫార్మా సీఈఓగా సూపర్ కూల్ గా కనిపించాడు. వెయిటర్ పాత్రలో మాస్ గా అలరించాడు. రెండూ అద్భుతంగా చేశాడు. నివేదా పేతురాజ్ విశ్వక్ ప్రేయసిగా అందంగా, ‘ కనిపించింది. వారి కెమిస్ట్రీని ఆకట్టుకుంది. అలాగే లవ్ ట్రాక్ లో మంచి హ్యుమర్ ఉంది.