డాక్టర్లు ఫుల్… పేషెంట్లు నిల్… బెడ్స్ ఆక్యుపెన్సీ రేషియో 25 శాతమేనా? అంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు డాక్టర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 20 కోట్లతో ఆధునీకరించిన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగానే హరీశ్ రావు పై వ్యాఖ్యలు చేశారు. పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు.
ఈ క్రమంలో ఆస్పత్రిలోని పరిస్థితులు, వైద్యుల తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలు లేవన్న సాకుతో.. పనిచేయకపోవడం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో డెలివరీలు ఎందుకు చేయడంలేదని, జూలై నెలలో కేవలం 3 డెలివరీలేనా? అంటూ నిలదీశారు. డాక్టర్లకు ఇక్కడ పనిలేదని, వారందరూ పటాన్ చెరు ఏరియా ఆస్పత్రిలో పనిచేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.