తెలంగాగణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. 2018లో ధర్మపురి అసెంబ్లీ ఎన్కికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అబ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని మంత్రి కొప్పల మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మంత్రి పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్‌ను సవాల్ చేస్తూ కొప్పుల ఈశ్వర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు మంత్రి కొప్పుల పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
