జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కొందరి ప్రముఖులకు ఛాలెంజ్ లు వేశారు. జనసేన అధినేత పవన్, మాజీ క్రికెటర్ సచిన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు కేటీఆర్ సవాల్ విసిరారు. చేనేత దుస్తులు ధరించాలని, తాను ధరించిన కొన్ని ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ (రామ్ భాయ్) ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ను దీనికి నామినేట్ చేస్తున్నానని పవన్ ప్రకటించారు. ఇక… పవన్ స్పందనకు కేటీఆర్ ధన్యవాదాలు ప్రకటించారు.
Thanks @PawanKalyan Anna https://t.co/2bjZ0hCt3Y
— KTR (@KTRTRS) August 7, 2022