భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన బిడ్డగా చొరవ చూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని కూడా కోరారు. జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో వుందని, అందుకు గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ పల్లెల్లో ఎక్కడా విద్యుత్ గోసలు లేవని, ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన రోజు ఆమె సొంత ఊరుకు కరెంట్ వచ్చిందని, తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. గిరిజన రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో వుందని, రాష్ట్రం పంపిన తీర్మానాన్ని అమలు చేసేలా చూడాలని కోరారు. పోడు భూముల విషయంలో కేంద్రం కటాఫ్ డేట్ మార్చే విధంగా చొరవ చూపాలని కేటీఆర్ ముర్మును కోరారు.