కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై తెలంగాణ ఐటీ మంత్రి కె. తారక రామారావు ఫైర్ అయ్యారు. మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్ తన ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ పాదూషాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరన్న సంగతి, మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంతో మరోసారి రుజువైందని కేటీఆర్ అన్నారు. అబద్ధాలకు పెద్దకొడుకు అమిత్ షానే అని కౌంటర్ ఇచ్చారు. అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని పసలేని ప్రసంగం చేశారని విమర్శించారు. అమిత్ షాతో మునుగోడు ప్రజలకు పావలా ప్రయోజనం లేదన్నారు.మొన్న నల్లచట్టాలతో దేశ రైతులకు ఉరితాడు బిగించాలనుకున్న మోడీ ప్రభుత్వం.. తాజాగా విద్యుత్ చట్టంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలకు తెరతీసిందని కేటీఆర్ ఆరోపించారు.