Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారు : మంత్రి కేటీఆర్

భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని, చైనా, జపాన్‌ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్డీ ‘డీకోడ్‌ ది ఫ్యూచర్‌’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్‌ వన్‌గా ఎదుగుతామని వెల్లడించారు.

 

ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్‌ మన దేశం నుంచి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. భారత్ లోనూ ఎంతో మంది గొప్పవారు, తెలివైన వారు వున్నారని, అయితే.. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్‌ తరాలకు మనకన్నా మంచి భవితను అందించే అంశాలపై వారు దృష్టి పెట్టడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఏడాదంతా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, దృష్టి అంతా ఎన్నికలపైనే ఉంటుందని అన్నారు. దేశంలో ప్రధాన సమస్య ఇప్పుడు ఇదే అని కేటీఆర్ పేర్కొన్నారు.

 

బుధవారం కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని, అందులో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మొత్తం జనాభాలో 60 శాతం మంది యువతేనని తెలిపారు. దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నదని వెల్లడించారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయడం లేదన్నారు.

 

సింగపూర్ విస్తీర్ణంలో హైదరాబాద్‌ కన్నా చిన్నగా ఉంటుంది, అయినా అభివృద్ధిలో మాత్రం వేగంగా ముందుకెళ్తున్నదని వివరించారు. గత ఎనిమిదేండ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ.. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది. దేశ జీడీపీలో 5 శాతం వాటా తెలంగాణదే అని ప్రకటించారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 15 రోజులు దాటితే సంబంధిత అధికారి నుంచి రోజుకు రూ.వెయ్యి చొప్పున ఫెనాల్టీ వసూలు చేస్తున్నామని చెప్పారు. గత 75 ఏండ్లలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు.

Related Posts

Latest News Updates