కేంద్రంలోని బీజేపీపై మంత్రి కేటీఆర్ విడుచుకుపడ్డారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కొన్ని నిషేధిత పదాల జాబితాను కేంద్రం విడుదల చేయడంపై మండిపడుతూ ట్వీట్ చేశారు. ఇదేనా మీ భాష? అంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ.. నిరసనకారులను ఆందోళన్ జీవి అని పిలవడం మంచిదా? యూపీ సీఎం చేసిన 80-20 ఓకేనా? గాంధీని బీజేపీ ఎంపీ కించపరిచిన తీరు బాగానే వుందా? రైతులను ఉగ్రవాదులను అని అవమానించడం కరెక్టా? గోలీ మారో అంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడం కరెక్టా? అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
అయితే.. పార్లమెంట్ లో కొన్ని పదాలను నిషేధించారంటూ వచ్చిన వార్తలపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా పూర్తి వివరణ ఇచ్చారు. తాము ఎలాంటి పదాలనూ నిషేధించలేదని స్పష్టం చేశారు. తాము విడుదల చేసిన జాబితాలో ఉన్నవి గతంలో రికార్డుల నుంచి తొలగించిన పదాలని చెప్పారు. అన్ పార్లమెంటరీ పదాలను గతంలో బుక్ రూపంలో విడుదల చేసేవారని… పేపర్ వేస్ట్ చేయడం ఎందుకని… ఇప్పుడు ఆ పదాలను ఇంటర్నెట్ లో పెట్టామని ఓం బిర్లా తెలిపారు. అన్ పార్లమెంటరీ పదాలతో కూడిన 1,100 పేజీల డిక్షనరీని వాళ్లు (విపక్షాలు) చదివారా? అని ఓం బిర్లా ప్రశ్నించారు