తెలంగాణ ఐటీ మంత్రి కె. తారక రామారావు కాలికి స్వల్పంగా గాయమైంది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రమాదవశాత్తు జారి పడటంతో ఎడమకాలు చీలమండలం వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యిందని తెలిపారు. 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమయంలో ఓటీటీలో మంచి సినిమాలు వుంటే సూచించాలి అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక… కాలికి సంబంధించిన గాయాన్ని చూపుతూ… మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఫొటో కూడా పెట్టారు.
https://twitter.com/KTRTRS/status/1550816632963940353?s=20&t=QdUOfjSCBUo8zYqkpLMShw