కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశ యువత చాలా నష్టపోతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. చైనా నుంచి బయటకు వస్తున్న వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్లమెంటరీ ప్యానల్ నివేదికపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీకి ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజకీయానికి ప్రాధాన్యమిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. టెలిప్రాంప్టర్ చూసి ప్రసంగించడం సులువే. పటిష్ట ప్రయత్నాలు లేకపోతే ఫలితాలు రావడం కష్టం అని కేటీఆర్ పేర్కొన్నారు.
https://twitter.com/KTRBRS/status/1639523253554384897?s=20