Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రాజస్థాన్ హత్య షాక్ కు గురి చేసింది : కేటీఆర్ ట్వీట్

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన దర్జీ హత్యపై తెలంగాణ ఐటీ మంత్రి కె. తారక రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ హత్య వెనుక వున్న కారణం తనను తీవ్ర షాక్ కు గురి చేసిందన్నారు. అంతేకాకుండా తీవ్రమైన భయాందోళనకు కూడా లోనైనట్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి అనాగరిక హింసకు సమాజంలో చోటు లేదన్నారు. క్రూరమైన హత్యలకు పాల్పడే నేరస్థులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అత్యంత కఠినమైన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ నగరంలో సంచలన హత్య జరిగింది. ఇస్లాం మతాన్ని అవమానించాడంటూ దర్జీ షాపు యజమాని కన్హయ్య లాల్ ను కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన పట్టపగలే జరగడం విషాదం. నరికి చంపడమే కాకుండా ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మధ్యాహ్నం సమయంలో కన్హయ్య లాల్ అనే దర్జీ షాపుకి ఇద్దరు వచ్చారు.

కస్టమర్ల రూపంలో షాపులోకి వచ్చి, దుస్తుల కొలతలు తీసుకుంటుండగా కత్తులు బయటకు తీశారు. ఒకరు మొబైల్ లో కొలతలు తీసుకుంటుండగా.. మరో వ్యక్తి కన్హయ్య లాల్ పై కత్తితో దాడి చేశాడు. మెడపై వేటు వేయడంతో తల శరీరం నుంచి వేరైపోయింది. తమ ఇస్లాంకు అవమానం జరిగిందని, అందుకే ఈ హత్య చేస్తున్నామని ప్రకటించారు.

Related Posts

Latest News Updates