తెలంగాణ ఐటీ మంత్రి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన విభాగానికి సంబంధించిన ఫైల్స్ ను చూస్తున్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. కొన్ని ఫైల్స్ కి సంబంధించిన పని జరుగుతోందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఎడమ కాలి చీలమండలానికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో 3 వారాల పాటు విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఆయన వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.
Getting some file work done #WorkFromHome pic.twitter.com/SC2v7RtI5j
— KTR (@KTRTRS) July 26, 2022