రాజకీయాల విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేవారు. ఈ రోజుల్లో రాజకీయాలు అంటే అధికారం కోసమే అన్నట్లుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయాలను వీడాలని తరుచూ తనకు అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కంటే… జీవితంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని తనకు నిరంతరం అనిపిస్తుందని కూడా వ్యాఖ్యానించారు. ప్రముఖ కార్యకర్త గిరీశ్ గాంధీని స్మరించుకునే క్రమంలో నాగపూర్ లో ఓ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజకీయాలంటే ఏమిటీ? సమాజం, దేశం సంక్షేమం కోసం చేసేవా? లేదా ప్రభుత్వంలో ఉండటం కోసం చేసేవా? అంటూ సూటిగా ప్రశ్నించారు. సామాజిక ఉద్యమాల్లో భాగంగా గతంలో రాజకీయాలు సాగేవని, కానీ.. ఇప్పుడు అధికారం కోసమే అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయని గడ్కరీ పేర్కొన్నారు.