రుషికొండలో మైనింగ్ అక్రమాలు జరిగాయంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు చేసిన కామెంట్స్ పై వైసీపీ ప్రభుత్వం స్పందించింది. రుషికొండలో మైనింగ్ అక్రమాలు జరగలేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రకటించారు. రుషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. చంద్రబాబువి చౌకబారు ఆరోపణలని ఫైర్ అయ్యారు. కుప్పం మైనింగ్ విషయంలోనూ చంద్రబాబు ఇవే అబద్ధాలు ఆడారని, అధికారులే స్వయంగా మైనింగ్ ను పర్యవేక్షించారన్నారు.
టీడీపీ హయాంలోనే మైనింగ్ అక్రమాలు జరిగాయని మంత్రి కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో వైసీపీ రౌడీయిజం గనక చేస్తే చంద్రబాబు అక్కడి నుంచి గెలవలేరని అన్నారు. కుప్పంలో మైనింగ్ చేసేది టీడీపీ నేతలనేనని అన్నారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను శాటిలైట్ ద్వారా ఫొటోలు తీసి పరిశీలిస్తున్నామని, ఎలాంటి అవకతవకలు జరగలేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.