ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా ప్రధాని నరేంద్ర మోదీతో సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారుతోంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంత్యుత్సవాల సందర్భంగా భీమవరంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. భీమవరం వేదికగానే అల్లూరి కాంస్య విగ్రహాన్ని వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు.
ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. సభ ముగిసిన తర్వాత ప్రధాని బయల్దేరే ముందు సార్.. ప్లీజ్.. సెల్ఫీ.. అంటూ రోజా అడిగారు. దీనికి ప్రధానికి ఓకే చెప్పారు. అయితే.. మొదటి సారి సెల్ఫీ క్లిక్ మంది అనుకొని మోదీ కాస్త దూరం జరిగారు. సార్.. ప్లీజ్.. ప్లీజ్ అని రోజా అనడంతో ప్రధాని మోదీ మరోసారి సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీలో సీఎం జగన్ కూడా ఉన్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కూడా రోజా సెల్ఫీ దిగారు.