తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. విచారణ జరుపుకోవచ్చని, తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవని తెలంగాణ విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే తీగల సబితపై చేసిన ఆరోపణల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి పై విధంగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే తీగలను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన అలా ఎందుకు మాట్లాడారో తనకు తెలియదన్నారు.
ఇదేమీ పెద్ద ఇష్యూయే కాదని స్పష్టం చేశారు. తనపై భూ కబ్జాలతో పాటు ఇతర ఆరోపణలు వస్తే.. సీఎం కేసీఆర్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని అన్నారు. కబ్జాలు చేసి వుంటే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు. అయితే.. మాజీ ఎమ్మెల్యే తీగల తనపై అలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.