తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు ఎల్దండి దర్శకత్వంలో హర్షిత్, హన్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న థియేటర్స్‌లో విడుదలైంది. సక్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి ఆదరణను దక్కించుకుంటుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం సినిమా ఆకట్టుకుంటోంది. మనందరి జీవితాల్లో జరిగిన , మనం చూసిన ఘటనలను ఆధారంగా చేసుకుని మనిషికి బందాలే గొప్ప బలం.. బలగం అనే చాటి చెప్పేలా సినిమాను రూపొందించారు. ఈ సినిమాను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ సోమవారం ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం.. బలగం టీమ్‌ను అప్రిషియేట్ చేస్తూ మీడియాతో మాట్లాడుతూ …
‘‘సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించటమే కాకుండా పలు టీవీ షోస్‌లో నటించి ఆకట్టుకున్న వేణు ఎల్దండిగారు ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారారు. దిల్ రాజుగారు ఎప్పుడూ మంచి చిత్రాలను అందించాలని ఆలోచిస్తుంటారు. ఆయన వారసులైన హర్షిత్, హన్షితలు ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించాలనే సంకల్పంతో ‘బలగం’ అనే చిత్రాన్ని నిర్మించారు. గ్రామీణ వాతావరణంలో రియాలిటీగా తరతరాలుగా జరిగే ఓ పాయింట్‌ను తీసుకుని దాన్ని కథగా మార్చారు. దాంట్లో ప్రియదర్శిగారు, కావ్యా కళ్యాణ్ రామ్‌గారు ప్రధానమైన పాత్రలను పోషించారు.