ఆలిండియా హెయిర్ అండ్ బ్యూటీ అసోసియేష్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ తమిళనాడు పోటీలు జరిగాయి. చెన్నైలో జరిగిన ఫైనల్ పోటీల్లో మిస్ తమిళనాడు గా సమంత, ద్వితీయ స్థానంలో దీప్సికా నిలిచారు. అదేవిధంగా శ్రీమతి తమిళనాడుగా జాన్ ప్రిస్కా, ద్వితీయ స్థానంలో జమీలా నిలిచారు. రాష్ట్ర సహకారశాఖ ముఖ్యకార్యదర్శిగా డాక్టర్ జె.రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అందాల భామల ర్యాంప్ వాక్ విశేషంగా ఆకట్టుకుంది.
