బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్య చేశారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రకటించారు. వారందరికీ బీజేపీతో సత్సంబంధాలే వున్నాయంటూ బాంబు పేల్చారు. మొత్తం 38 ఎమ్మెల్యేలకు గాను… 21 మంది ఎమ్మెల్యేలు అయితే.. నేరుగా తనతోనే టచ్ లో వున్నారంటూ బాంబు పేల్చారు. మీకు బ్రేకింగ్ కావాలా? అంటూ అడిగి మరీ.. విలేకరులతో మిథున్ ఈ వార్త చెప్పడం విశేషం. అయితే.. ఎప్పుడు చేరుతారు? అసలు చేరుతారా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే.. దీనిపై టీఎంసీ ఘాటుగా స్పందించింది. మిథున్ కు బహుశ: మెంటల్ అయి వుండవచ్చునని టీఎంపీ ఎంపీ శాంతను సేన్ మండిపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చేరారని విన్నామని, ఆయనకు మానసిక సమస్య వుంటుందంటూ ఎద్దేవా చేశారు. ఆయన మాటలను బెంగాల్ లో ఎవ్వరూ పట్టించుకోరని అన్నారు.