టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. మిథునం సినిమా నిర్మాత మొయిద ఆనంద రావు (57) కన్నుమూశారు. మధుమేహంతో చాలా కాలం నుంచి బాధపడుతున్న ఆనంద రావు… కొన్ని రోజులుగా వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి బాగా విషమించడంతో కన్నుమూశారు. ఆనంద రావుకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు వున్నాడు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం స్వస్థల వావిలవలసలో జరగనున్నాయి. మొయిద ఆనందరావు సీతారాంపురం దగ్గర, వావిలవలస అనే చిన్న గ్రామం లో పుట్టాడు. ఒక ప్రైవేట్ కంపెనీ లో చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు.
