అమర్ నాథ్ లో ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయి. వరదలు కూడా బీభత్సంగా వచ్చేశాయి. ఈ వరదలతో 13 మంది భక్తులు చనిపోయారు. మరో 40 మంది గల్లంతైయ్యారు. అయితే.. ఈ వరదలు వచ్చిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడే వున్నారు. ఆయనే ప్రత్యక్ష సాక్షి. అయితే.. తాము అమర్ నాథ్ మంచు లింగాన్ని దర్శించుకున్నామని తెలిపారు. దర్శనం అయిన తర్వాత వెనుదిరిగామన్నారు. అయితే.. వరదలపై ఆయన మాట్లాడుతూ..
”ఒక్కసారిగా వరద వచ్చింది. నా కళ్ల ముందే చాలా మంది కొట్టుకుపోయారు. అస్తవ్యస్తంగా, భయంకరంగా వుంది” అంటూ రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. అక్కడ జరిగిన దానిని వివరించారు. గత 3 రోజులుగా అమర్ నాథ్ లో వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణం కావాలని అనుకున్నా.. వాతావరణం సరిగా లేని కారణంగా గుర్రాలపై వచ్చేశామని ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు.