ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది. వరద సహాయక చర్యల్లో భాగంగా ఆమె ఏటూరునాగారం ఎలిశెట్టిపల్లిలో పర్యటిస్తున్నారు. బోటుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా బోటు ఈగిపోయింది. బోటు పక్కకు కొట్టుకు వచ్చి, చెట్టుకు తగిలి ఒడ్డుకు చేరింది. దీంతో ఆమె సురక్షితంగా బయట పడ్డారు. దీంతో అధికారులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
గోదావరికి వరద తీవ్రంగా రావడంతో నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో పరిస్థితి ఘోరంగా వుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే సీతక్క కొన్ని రోజులుగా ప్రజల కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. కాలినడకన, మోకాలి లోతు నీళ్లలోనూ పర్యటిస్తున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందిస్తున్నారు. దీంతో తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇంతకు పూర్వం కూడా మహమ్మారిలోనూ సీతక్క ఇంటింటికీ తిరిగి ప్రజలకు సహాయాన్ని అందిస్తూ.. అందరి మన్నలనూ పొందారు.