Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఈ నెల 10 న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ధర్నా : ఎమ్మెల్సీ కవిత

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును పార్ల‌మెంట్ ముందుకు తీసుకురావాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భార‌త జాగృతి అధ్య‌క్షురాలు కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ పనికి పూనుకోవాలని సూచించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు సంబంధించి భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో రెండు సార్లు హామీ ఇచ్చి మాట త‌ప్పుతుంద‌ని విమర్శించారు.

కేంద్ర వ్యవహార శైలిని నిరసిస్తూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10 న ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దీక్ష‌కు అన్ని పార్టీలు, సంఘాల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని తెలిపారు. మార్చి 13 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉంటాయి కాబ‌ట్టి.. ఈ స‌మావేశాల్లోనే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు క‌విత పేర్కొన్నారు. ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Related Posts

Latest News Updates