మునుగోడు టీఆర్ఎస్ కంచు కోట అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల మాదిరిగానే… అక్కడ కూడా విజయం సాధిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో హేమాహేమీలను ఓడించిన చరిత్ర టీఆర్ఎస్ ది అని పేర్కొన్నారు. మునుగోడులో తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేకపోయినా… డెవలప్ మెంట్ ఆగదని, కొనసాగుతూనే వుంటుందని ప్రకటించారు. కరోనా సమయంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయలేదని గుర్తు చేశారు.
బీజేపీవి బ్యాక్ డోర్ రాజకీయాలని, అవి మంచివి కావని హితవు పలికారు. ఇలాంటి వాటికి మునుగోడు ఉప ఎన్నిక సమాధానం చెబుతుందని కవిత అన్నారు. దేశం కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకోవడానికి సీఎం కేసీఆర్ అద్బుతమైన కార్యక్రమాలు చేపడుతున్నారని కవిత చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది పోరాటం చేశారని చెప్పారు. తెలంగాణ రాక ముందు గ్రీనరీ 21 శాతం ఉంటే..ఇప్పుడు 31 శాతానికి పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరు జై హింద్ అనాలి..ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని కవిత పిలుపునిచ్చారు.