Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణకి మోదీ ప్రభుత్వం గిఫ్ట్… బేగంపేట విమానాశ్రయంలో “”పౌర విమానయాన పరిశోధనా కేంద్రం”

తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. 400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ (కారో) ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. శంలోనే తొలిసారి 5జీ టెక్నాలజీతో ఈ కేంద్రం నిర్మిస్తున్నారు. 2023 జులై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైటెక్ టెక్నాలజీతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటుచేసుకోనున్న సాంకేతిక మార్పులపై ఇందులో పరిశోధనలు జరగనున్నాయి.

 

ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే టార్గెట్ గా పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా పరిశోధన, విమానయాన అభివృద్ధి, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, ఎయిర్ ట్రాఫికింగ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్ డొమైన్ ఎమ్యులేషన్ , నెట్‌వర్క్ ఎమ్యులేటర్, అనాలసిస్ ల్యాబ్స్ ఏర్పాటవుతాయి. అంతేకాకుండా ప్రమాద విశ్లేషణ కేంద్రం, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, డేటా మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సెంటర్‌లు కూడా ఈ కేంద్రంలో ఉంటాయి.

1. విమానాశ్రయాలు, ఎయిర్ నావిగేషన్ సేవలకు సంబంధించిన పరిశోధనా సౌకర్యాలు
2. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్స్ 
3. డొమైన్ సిమ్యులేటర్స్
4. నెట్ వర్క్ ఎమ్యులేటర్
5. విజువలైజేషన్ & అనాలసిస్ ల్యాబ్స్
6. సర్వెలెన్స్ (నిఘా) ల్యాబ్స్
7. నావిగేషన్ సిస్టమ్స్ ఎమ్యులేషన్ & సిమ్యులేషన్ ల్యాబ్స్
8. సైబర్ సెక్యూరిటీ & థ్రెట్ అనాలసిస్ ల్యాబ్స్
9. డేటా మేనేజ్‌మెంట్ సెంటర్
10. ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్
11. సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ & టూల్స్ సెంటర్ ఇలా… పరిశోధనా సౌకర్యాలు వుండనున్నాయి.

Related Posts

Latest News Updates