Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మోహన్ బాబు బీజేపీ మనిషా? జగన్ కు దూరం జరిగినట్టేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించేశాడు. ఇప్పటి వరకూ వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీకి జై కొట్టగా.. హఠాత్తుగా ఆయన మనస్సు బీజేపీ వైపు మళ్లింది. తాను బీజేపీ మనిషినంటూ స్వయంగా ప్రకటించేసుకున్నారు. కేంద్రంలో బీజేపీయే అధికారంలో వుండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఓ కేసు సందర్భంగా మోహన్ బాబు తిరుపతిలోని కోర్టు ముందు హాజరయ్యారు. తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టు వరకూ తన కుమారులు, సిబ్బందితో పాదయాత్రగా వచ్చి, కోర్టుకు హాజరయ్యారు.

 

మోహన్ బాబు మొదట్లో తెలుగు దేశం. ఆ పార్టీ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఆ తర్వాత హఠాత్తుగా ఆయన జగన్ గూటికి చేరుకున్నారు. నిజానికి వైఎస్ కుటుంబానికి మోహన్ బాబు బంధువు కూడా. అయితే 2019 ఎన్నికల తర్వాత వైసీపీకి దూరమవుతూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య సీఎం జగన్ సినిమా రంగానికి సంబంధించిన చర్చల్లో మెగాస్టార్ చిరంజీవికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీయే కనిపించలేదు. అయినా.. మంచు కుటుంబం వైసీపీతోనే వుందని అందరూ భావిస్తున్న తరుణంలో మోహన్ బాబు తాను బీజేపీ మనిషినంటూ బాంబు పేల్చారు.

ఇలా సిగ్నల్స్ ఇవ్వడం రెండో సారి…

గతంలోనూ మోహన్ బాబు మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ అద్భుతమైన నేత అంటూ కొనియాడారు. ఆ మధ్య ఢిల్లీ వెళ్లి మరీ మోదీని కలిసొచ్చారు. ఎన్టీఆర్ సమయంలో టీడీ నుంచి రాజ్యసభకు వెళ్లానని, ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీ కోసం 1998 లోనే పనిచేశానని సంస్కృతి మహోత్సవంలో పాల్గొంటూ పై వ్యాఖ్యలు చేశారు. వాజ్ పాయ్, అద్వానీ, వెంకయ్య నాయుడితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, బీజేపీకి 18 శాతం ఓట్లు వచ్చాయన్నారు. మోదీ అద్భుతమైన నేత అంటూ ప్రశంసించారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా ప్రశంసలు చేశారు. మార్చిలో ఈ వ్యాఖ్యలు చేస్తే.. మళ్లీ బీజేపీ మనిషినంటూ తాజాగా వ్యాఖ్యానించారు.

బీజేపీ కండువా కప్పేసుకుంటారా?

తాను బీజేపీ మనిషినంటూ మోహన్ బాబు ప్రకటించుకున్నారు. మరి జగన్ కి గుడ్ బై చెప్పేస్తారా? అన్న క్లారిటీ మాత్రం ఇప్పటికి రాలేదు. ముందు నుంచి కూడా మోహన్ బాబు కాస్త బీజేపీ వైపు మొగ్గే మనిషే. కానీ అప్పుడప్పుడు బయటపడేవారు. మళ్లీ సైలెంట్ అయిపోయేవారు. ఇప్పుడు మరోసారి బయటపడ్డారు. అయితే.. రాష్ట్రంలోనూ బీజేపీ మనిషిగా ముద్రేసుకుంటారా? కేవలం జాతీయ అంశాల్లో మాత్రమే బీజేపీకి మద్దతిస్తారా? అన్నది చూడాలి. అంతేకాకుండా అధికారికంగా కూడా బీజేపీ కండువా కప్పుకుంటారా? అన్నది కూడా చూడాలి.

కోర్టుకు హాజరైన మోహన్ బాబు

మోహన్ బాబు, తన కుమారులు విష్ణు, మనోజ్ పై 2019 మార్చి 22న కేసు నమోదైంది. విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ కోసం ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లాలో వున్న శ్రీవిద్యా నికేతన్ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు ఫీజు రియంబర్స్ మెంట్ కోసం రోడ్డుపై బైఠాయించారు.

 

ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో వుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తూ మోహన్ బాబు ధర్నా చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే.. తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఎందుకంటే.. తాను రియల్ హీరోనని, తనకు అభిమానులు వున్నారని, మాట్లాడించారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

 

 

 

Related Posts

Latest News Updates