రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని భువనగిరి ఎంపీ, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు చేయించుకున్నా… కాంగ్రెస్ వైపే ప్రజలు ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ కు బర్రెలు, గొర్రెలు గుర్తొస్తాయని, మిగతా సమయంలో గాలికి వదిలేస్తారని ఎద్దేవా చేశారు.
ధనికమైన రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్ తన పాలన ద్వారా అప్పుల ఊబిలోకి దిగపడిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లైనా… ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. పీసీసీ స్టార్ క్యాంపెనర్ గా తెలంగాణ మొత్తం పర్యటించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.