తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి డా.కె. లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రశంసించారు. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీని విమర్శించే స్థాయి సీఎం కేసీఆర్ కు లేదన్నారు. తెరాసలో కట్టప్పలు సిద్ధంగా వున్నారని, వీరి విషయంలో తమది కేవలం ప్రేక్షకపాత్రేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లేందుకు యత్నాలు చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.