మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ను వీడి, బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ ను వీడొద్దని, పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని, ఉత్తమ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డితో అన్నట్లు తెలుస్తోంది. అయితే.. కోమటిరెడ్డి నుంచి ఎలాంటి హామీ రాలేదని తెలుస్తోంది.
కోమటిరెడ్డి పార్టీని వీడుతున్నారని వార్తలు రావడంతో అధిష్ఠానం కూడా అలర్ట్ అయ్యింది. ఓ సారి ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒకప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ దిగ్విజయ్ సింగ్ కోమటిరెడ్డిని కోరారు. అయినా… కోమటిరెడ్డి నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకొని, ఓ సారి మాట్లాడినట్లు సమాచారం.