ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మల్యే జీవన్ రెడ్డిపై హత్యప్రయత్నం జరగడం కలకలం రేపుతోంది. ఆర్మూర్ దగ్గర వుండే కిల్లెర గ్రామ సర్పంచ్ భర్తే… ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారు. తన భార్య లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంలో జీవన్ రెడ్డి పాత్ర వుందన్న కోపంతో.. సర్పంచ్ భర్త ఈ హత్యకు కుట్ర పన్నాడు. అయితే.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం ముందు ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బంజారా హిల్స్ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర వుండే పిస్టోల్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను త్వలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
