RRR సినిమా నిర్వాహకులు మరో లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట పాడే అవకాశాన్ని కొట్టేశారు. మార్చి 12 న లాస్ఏంజెల్స్ లో ఆస్కారాలు వేడుకలు జరగనున్నాయి. ఈ వేదికపై నుంచే గాయకులు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ నాటు నాటు పాట పాడనున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో RRR సినిమా యూనిట్ కి మరో అరుదైన అవకాశం దక్కింది. ఇప్పటికే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే RRR సినిమా పలు గొప్పవైన అవార్డులను గెలుచుకుంది.
