థ్యాంక్యూ మూవీపై యంగ్ హీరో నాగ చైతన్య మూడ్ ఆఫ్ గా వున్నారా? ఆ సినిమా ఆయనకు డిస్పపాయింట్ చేసిందా? అంటే అవునని ఆయనే స్వయంగా చెప్పారు. థ్యాంక్యూ మూవీ తనను చాలా డిస్పపాయింట్ చేసిందని అన్నారు. లైఫ్ లో ఫెల్యూయర్, సక్సెస్ ఒక భాగం మాత్రమేనని, తనను తాను ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిందేనని అన్నాడు. అందు కోసం నిరంతర సాధన చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తనకు సౌత్, నార్త్ అన్న తేడాల్లేవని, అయితే.. తెలుగు, తమిళ ఇండస్ట్రీ అంటే ప్రాణమని, ఆ తర్వాత ఏదైనా అని అన్నాడు. లాల్ సింగ్ చడ్డా సినిమాలో తన క్యారెక్టర్ పేరు బాలరాజు అని, కావాలని తెలుగు ప్రాంతం కోసం ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేశారని పేర్కొన్నాడు. కార్గిల్, జమ్మూతో పాటు గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేశామని పేర్కొన్నాడు.