అగ్రహీరో నందమూరి బాలకృష్ణ వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటికి మొన్న అక్కినేని తొక్కినేని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై అక్కినేని కుటుంబం ఘాటుగా స్పందించింది. తాజాగా… అన్ స్టాపబుల్ టాక్ షో లో నందమూరి బాలకృష్ణ నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ షోకి పవన్ కల్యాణ్ గెస్ట్ గా వచ్చాడు. నర్సులపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నర్సులను కించపరిచేలా వున్నాయంటూ మండిపడ్డారు. దీనిపై బాలకృష్ణ స్పందించారు.
”అందరికీ నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను… నా మాటలను కావాలనే వక్రీకరించారు రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ… మీ నందమూరి బాలకృష్ణ”