నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘దసరా’. పాన్ ఇండియా లెవల్లో నాని తొలి మూవీగా ఈ చిత్రంతో నాని బాక్సాఫీస్ దగ్గర సందడి చేయటానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు నాని కనిపించనటువంటి రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఆ విషయం క్లియర్ కట్‌గా అర్థమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న దసరా మూవీ రిలీజ్ కానుంది . శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. నేను లోకల్ తర్వాత వీరిద్దరూ జంటగా నటిస్తోన్న చిత్రమిది. సముద్ర ఖని, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల వరుస ప్లాపులతో వెనకపడ్డ నాని తొలిసారిగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాపై నాని అండ్ టీమ్ ఎంతో హోప్స్ పెట్టుకున్నారు.
https://twitter.com/NameisNani/status/1563038907172003842