Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

విజయనగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఓకే చెప్పిన NMC…

విజయనగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్ ఓకే అయ్యింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో వైద్య విద్యలో కీలక ముందడుగు పడిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు NMC నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందాయి. 2023-2024 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. మరో 4 మెడికల్ కాలేజీలకు త్వరలోనే అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని NMC పేర్కొంది. దీంతో ఏపీలో మెడికల్ సీట్ల సంఖ్య 1249 కి పెరిగాయి.

 

ఈ యేడాదే మరో 4 వైద్య కళాశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో మొత్తం 17 వైద్య కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో అకాడమిక్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 5 చోట్ల జిల్లా ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపదికన బోధనాసుపత్రులుగా తీర్చిదిద్దడంతో పాటు ఒక్కో చోట 150 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లకు అనుమతులు కోరుతూ ప్రభుత్వం NMC కి లేఖలు రాసింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం వైద్య కళాశాలలో అడ్మిషన్లకు ఆమోదం లభించింది. మిగిలిన 4 కళాశాలలకు ఆమోదం లభించాల్సి వుంది.

Related Posts

Latest News Updates