తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటయ్యాయి. ప్రజల అవసరాలు, పరిపాలనలో సౌలభ్యం కోసం మరిన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు… కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవిన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మండలాలకు చెందిన ఉత్తర్వులను ఉన్నతాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపారు. నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
సర్కార్ ఏర్పాటు చేసిన కొత్త మండలాలు
1. గట్టుప్పల్(నల్లగొండ)
2. కౌకుంట(మహబూబ్‌నగర్)
3. ఆలూర్(నిజామాబాద్)
4. సాలూర(నిజామాబాద్)
5. డొంకేశ్వర్(నిజామాబాద్)
6. సీరోల్(మహబూబాబాద్)
7. నిజాంపేట్(సంగారెడ్డి)
8. డోంగ్లీ(కామారెడ్డి)
9. ఎండపల్లి(జగిత్యాల)
10. భీమారం(జగిత్యాల)
11. గుండుమల్(నారాయణపేట్)
12. కొత్తపల్లె(నారాయణపేట్)
13. దుడ్యాల్(వికారాబాద్)