దేశీయంగా తయారు చేసిన అత్యాధునిక ఆయుధ సంపత్తిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అప్పజెప్పారు. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు పరిసరాల్లో మోహరించడానికి, సైనిక సామర్థ్యాన్ని పెంచడానికి ఈ అత్యాధుని ఆయుధాలు ఉపయోగపడతాయి. నిపుణ్ అనే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్, ల్యాండింగ్ క్రాఫ్ట్, ఫ్యూచర్ ఇన్ ఫ్యాంట్రీ సోల్జర్ యాజ్ ఏ సిస్టమ్, రక్షిత పదాదిదళానికి చెందిన వాహనాల వంటి కీలకమైన సైనిక సంపత్తి వున్నాయి. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆ పరికరాలు పనిచేస్తాయి. సైనికుడికి రక్షణ కల్పించడానికి వీలుగా అత్యాధునికమైన హెల్మెట్ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ కూడా వుంటుంది. ఇక.. మిగతా పరికరాలు కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించింది. ఈ దేశీయ తయారీపై రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
