ఈసారి జరిగే పార్లమెంట్ సమావేశాలు ఎంపీలందరికీ కొత్త అనుభూతిని పంచనున్నాయి. ఇన్ని రోజుల పాటు పార్లమెంట్ పాత భవనం లోనే సమావేశాలు జరుగుతూ వచ్చాయి. ఈసారి నుంచి సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పార్లమెంట్ కొత్త భవనం ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతీక అని, పాత భవనంతో పోలిస్తే, కొత్త భవనం అన్ని రకాలుగా అత్యాధునికంగా వుంటుందని, భద్రతాపరంగా కూడా బాగుంటుందన్నారు.
ఇక.. స్పీకర్ గా ఓం బిర్లా 3 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సహకరించిన వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. కరోనా సమయంలోనూ అన్ని దేశాల పార్లమెంట్లు వర్చువల్ గా జరిగాయని, అంతటి క్లిష్ట సమయంలోనూ భారత పార్లమెంట్ మాత్రం లైవ్ సెషన్స్ నిర్వహించిందని గుర్తు చేసుకున్నారు. మూడేళ్లలో సభ పనితీరు బాగుందని కితాబునిచ్చారు.
The last 3 years were historical in terms of productivity and discussions held in Parliament. I thank PM & all MPs for their cooperation which has increased the public's faith in public representatives and Parliament: Lok Sabha Speaker Om Birla on completion of 3 years tenure pic.twitter.com/p6tXRdV6NW
— ANI (@ANI) June 19, 2022