తెలంగాణలో మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న సనత్ అనే మెడికో హాస్టల్ గదిలోనే ఉరేసుకున్నాడు. సనత్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్వస్థలం పెద్దపల్లి. అయితే… ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇంకా తెలియాల్సి వుంది. సమాచారం అందగానే.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సనత్ ఆత్మహత్యపై విద్యార్థులు, కాలేజీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కేవలం రెండు నెలల కాలంలోనే ఇద్దరు మెడికో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలానికి చెందిన దాసరి హర్ష కూడా ఉరేసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు సతన్ అలాగే ఉరేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో వైద్య విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వీటిని సీరియస్ గా తీసుకోవాల్సి వుంది.