ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. వివిధ రంగాల్లో ఆత్మ నిర్భర్ సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారంపై చర్చించనున్నారు.నీతి ఆయోగ్ సమావేశం యొక్క ఎజెండాలో పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలు,వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధిని సాధించడంపై చర్చిస్తున్నారు. జాతీయ విద్యా విధానం, పాఠశాల విద్య అమలు తీరు, జాతీయ విద్యా విధానం ఉన్నత విద్య అమలుపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
#WATCH | PM Narendra Modi chairs the 7th Governing Council meeting of Niti Aayog at Rashtrapati Bhawan Cultural Centre. pic.twitter.com/6EJyyYFwMd
— ANI (@ANI) August 7, 2022