అధికారుల విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వంలోని మంత్రులు చెప్పిన దానికి అధికారులు ఎస్ సార్ అనాల్సిందేనని అన్నారు. మంత్రులు చెప్పిందే బ్యూరోక్రాట్లు చేయాలని అన్నారు. పేద ప్రజ సంక్షేమం విషయంలో గాంధీ చెప్పిన కొటేషన్ ను మంత్రి గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ చట్టాన్ని అయినా 10 సార్లు ఉల్లంఘించ వలసి వచ్చినా వెనుకాడకూడదు,పేదల సంక్షేమానికి ఏ చట్టం అడ్డురాదని నాకు తెలుసు’’అని గడ్కరీ గుర్తు చేశారు. పేదల సంక్షేమం కోసం అటవీ చట్టాలను ఉల్లంఘించి అయినా రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రి గడ్కరీ వివరించారు.