నటి నిత్యామీనన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. మలయాళ స్టార్ హీరోతో నిత్యా మీనన్ ప్రేమలో పడ్డారని, అతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ పుకార్లపై నిత్యా మీనన్ డైరెక్టుగానే స్పందించింది. ఈ వార్తలు సత్యదూరమని ఖండించారు. ఏ విషయమైనా నిజమని తెలుసుకున్నాకే, దాన్ని పబ్లిష్ చేయాలని మీడియాను కోరారు. దీంతో నిత్యా మీనన్ పెళ్లి విషయంపై వస్తున్న పుకార్లకు చెక్ పడినట్లైంది. ఈ యేడాది నిత్యా మీనన్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నటించిన 19 (1) (ఏ) అనే మలయాళ చిత్రం తర్వలోనే ఓటీటీలో రానుంది. ప్రస్తుతం తిరుచిత్రంబం అనే తమిళ సినిమాలో బిజీగా వున్నారు.